CinemaRoundup

Movies|Politics|Astrology

Cinema news

“పందెం కోడి ” అరెస్ట్

vishal arrest cover page

ప్రస్తుతం తమిళనాడు లో హీరో విశాల్ చాల కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అటు నిర్మాతగా , నడియర్ సంఘం అధ్యక్షుడిగా , టీ.ఫ్.పి సి ప్రెసిడెంట్ గా చాల బాధ్యతలు వహిస్తున్నాడు .
నిన్న తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వద్ద విశాల్ లేని సమయంలో అతని అసమ్మతి వర్గం బలవంతంగా తాళాలు వేసి నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే.అందులో విశాల్ ప్రాణ స్నేహితుడు ఆర్ కే సురేష్ కూడా ఉండడం విశేషం . విశాల్ 2015లో ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

విశాల్ ఇవాళ నేరుగా ఆఫీస్ వద్దకు చేరుకొని తాళాలు తీసే ప్రయత్నం చేసాడు. అయితే అప్పటికే ఉన్న టైట్ పోలీస్ సెక్యూరిటీ ఆ పనిని చేయకుండా అడ్డుకుంది.

దీంతో పోలీసులకు విశాల్ కు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఎవరో బయటి వ్యక్తులు తాళం వేసి పారిపోతే లోపల ఆస్తులకు మీరు గ్యారెంటీ ఇస్తారా అంటూ విశాల్ పోలీసుల్ని నిలదీయటంతో వ్యవహారం అరెస్ట్ దాక వచ్చింది.

విశాల్ అరెస్ట్ తో కోలీవుడ్ నిర్మాతల మండలి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . త్వరలో బిల్డింగ్ ఫండ్ కోసం ఇళయరాజాతో చేయాలనుకున్న కార్యక్రమం జరగకుండా అడ్డుపడేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విశాల్ మండిపడుతున్నాడు.
కమల్ హాస్సన్ సైతం ఈ విషయం పై ఆరాతీస్తున్నారు అంట . ఈ వివాదం వెనుక ప్రస్తుతం ఉన్న తమిళనాడు గవర్నమెంట్ హస్తం ఉంది పలువురు అంటున్నారు , చూడాలి ఇది ఎంత వరకు వెళ్తుందో .