Reviews

సినిమా రివ్యూ: వినయ విధేయ రామ

Vinaya Vidheya rama rveiw

రివ్యూ: వినయ విధేయ రామ
రేటింగ్‌: ——– (మీరే ఫిల్ చేస్కోండి )

బ్యానర్‌: డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: రామ్‌ చరణ్‌, కియరా అద్వాని, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ, ఆర్యన్‌ రాజేష్‌, హేమ, పృధ్వీ, మధుమిత, రవివర్మ, ముఖేష్‌ రిషి, హరీష్‌ ఉత్తమన్‌ తదితరులు
మాటలు: ఎం. రత్నం
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
ఛాయాగ్రహణం: రిషి పంజాబి, ఆర్థర్‌ ఏ. విల్సన్‌
నిర్మాత: డి.వి.వి. దానయ్య
కథ, కథనం, దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: జనవరి 11, 2019

కేవలం కాంబినేషన్స్ తో సినిమాలు ఆడుతాయి అని అనుకుంటే ఒక సారి మీరు ఈ సినిమా చూడొచ్చు , ఇందులో ఒక సీన్ గురించి వివరించాలి .


“హీరోను ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అతడిని విలన్ రెచ్చగొడతాడు. అంతే.. హీరోకు ఆవేశం వస్తుంది. అతను విసిరిన విసురుకి గొలుసులు కట్టేసి ఉన్న ఇనుప స్తంభాలు భూమి లోతుల్లోంచి బయటికి వచ్చేస్తాయి.”

అంటే “రంగస్థలం” లాంటి సినిమాలో యాక్ట్ చేసిన హీరో రామ్ చరణేనా ఈ సినిమా ఒప్పుకుంది అని అనిపిస్తుంది .

“దూకుడు ” “బాద్షాహ్ ” చిత్రాల్ని తీసిన వైట్ల పరిస్థితి ఏంటి అన్నది “అమర్ , అక్బర్ , ఆంథోనీ ” తో రుజువు ఇయ్యింది . ఎమోషన్స్ ని ఎలేవేషన్స్ లో పీహెచ్డీ పొందిన రాజమౌళి ఎక్కడున్నాడో మీకు తెలుసు . రాజమౌళి సినిమా సినిమాకి వేరియేషన్స్ తో పాటు కొత్తదనం కోసం పడే శ్రమ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కనపడుద్ది .

ఇంకా బోయపాటి దగ్గరకి వచ్చేసరికి ఒక హిట్ ఒక అవేరేజ్ సినిమాలతో బండి లాగించేస్తున్న దర్శకుడికి , రంగస్థలం లాంటి హిట్ అందుకున్న హీరో దగ్గర నుండి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఎలా ఉంటాయి ?

ఈ లైన్ ఆల్రెడీ రామ్ చరణ్ ” బ్రుసెలీ ” లో ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు . అక్క చదువు కోసం తన భవిష్యత్తుని త్యాగం చేసే తమ్ముడిగా నటించాడు . ఇప్పుడు చిన్న చేంజ్ ఇందులో అక్కను తీసేసి అన్నని పెట్టేసాడు మన బోయపాటి . వావ్ అనాలి . బోయపాటి ఇక్కడితో ఆగితే ఎలా , ఇందులో లైట్ గా కొంచం అతి జోడిస్తే ఎలా ఉంటది ? నా సామిరంగా అని అనుకున్నాడో ఏమో వేసేశాడు .

క్రూరమైన మనస్తత్వం ఉండే విల్లన్ , దేనికైనా తెగించి పోరాడే హీరో , ఇద్దరి మధ్య కాంఫ్లిక్ట్ , హీరో నే క్లైమాక్స్ లో గెలిచేది . ఇది ఒక చిన్నపిల్లాడు చుసిన చెప్పస్తాడు అంత పేలవమైన లైన్ .

సినిమాలో దాదాపు సగభాగం చరణ్ ఫైట్లు మాత్రమే చేశాడు. ఇంకా చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ చేసింది ఫైట్లు మాత్రమే.
ట్రెయిలర్‌ ఏమిటి అలా కట్‌ చేసారనుకున్న వారికి ‘సమాధానం’ సినిమాలో దొరుకుతుంది. అంతకుమించి కట్‌ చేయడానికి ఏమీ లేదు మరి.
యాక్షన్ సన్నివేశాల్లో.. డ్యాన్సుల్లో అతను ఎప్పట్లాగే రాణించాడు. హీరోయిన్ కియారా అద్వానీ కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె అందంగా కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడు.
ఇందులోని సదరు కామెడీ దృశ్యాలు చూస్తే, దీనికి బదులు మరో రెండు ఫైట్లు పెట్టి ఇంకో వంద తలలు నరికేసి వుండాల్సిందనిపిస్తుంది.
ఈ మధ్య అసలే దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పదును ఉండట్లేదు. పైగా ‘వినయ విధేయ రామ’ కథ విన్నాక అతడిలో ఉత్సాహం మరింత తగ్గిపోయిందేమో. చెప్పుకోవడానికి ఒక పాట లేదు. నేపథ్య సంగీతంలోనూ ఏ ప్రత్యేకతా లేదు.
ఇక దర్శకుడు బోయపాటి శ్రీను.. మాస్ సినిమా అంటే ఏమైనా చెల్లిపోతుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది.
రెండో రోజు వసూళ్ల గురించిన చింతలేకుండా మొదటిరోజే ఫాన్స్‌కి స్పష్టతనిస్తుంది
.

ఈ మాత్రం దానికి ఇంత భారీ సెట్టింగ్లు , అజైర్బైజాన్ లో ఫైట్స్ ఆవరసరం లేదు .

ఈ సినిమా తోడు ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా మిశ్రమ స్పంద వస్తుంది . చూడాలి ఈ సంక్రాంతి విజేతలెవరో .

బాటమ్‌ లైన్‌: మమల్ని వొగ్గేయ్యే మామ