వసంత పంచమి

vasantha panchami

వాక్కుకి , బుద్ధికి , వివేకానికి , విద్యకు , కళలకు, విజ్ఞానానికి ఆది దేవత సరస్వతి దేవి .ప్రపంచం మొత్తం ధనం , చదువు చుట్టే తిరుగుతుంది , అందుకే మనం లక్ష్మి , సరస్వతి దేవతలకు ఎనలేని గౌరవం ఇస్తాం.మనిషి బుద్ధి జీవిగా మరీనా తరువాత చదువుకు బాగా ప్రాధాన్యత పెరిగింది .చదువులకు శ్రీకారం చుట్టేటప్పుడు “విద్యారంభం కరిష్యామి , సిద్ధిర్భవతుమే సదా ” అని అమ్మనే అర్థిస్తున్నాం . ఈ రోజు సరస్వతి దేవి జన్మదినం గా పురాణాలూ చెబుతున్నాయి .చదువుకునే పిల్లలకు , చదువును అభ్యసించే వాళ్లకు ఈ రోజు చాల శుభప్రదం గా అంటుంటారు . ఈ రోజు కానీ విద్యార్థులు సరస్వతి దేవి కి పూజ చేస్తే ఎనలేని కీర్తి, గౌరవం లభిస్తుంది .

పసుపు రంగు వసంత పంచమి రోజున ఎక్కువగా ఉపయోగిస్తారు , ప్రత్యేకంగా ఈ రోజు పసుపురంగు పువ్వులు దేవుడికి సమర్పిస్తారు . పసుపు రంగు పవిత్రమైనది కానీ, ఈ రోజు ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు .

ఈ రోజు గృహ ప్రవేశం , పెళ్లిళ్లు మరియు నామకరం వంటి విశేషాలు జరుపుకుంటారు . కామదేవుడు మరియు రతి దేవికి కొన్ని చోట్ల పూజలు చేస్తారు , ఈ రోజు ప్రేమకు చిహ్నం అని కూడా అంటారు .

జ్యోతిష్యం ప్రకారం కూడా ఈ రోజు చాల శుభముగా పరిగణిస్తారు , మాఘ నెలలో సూర్యుడు ఉత్తర దిశగా మారుతుంది అని ఇది ఒక పవిత్రమైన దిశగా పరిగణించబడుతుంది .

ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహమాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్త కధ్రతే నమః
ఓం ఙ్ఞాన సముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః
ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయ్యై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మఙ్ఞా నైకసాధనాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలఙ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః

ఈ క్రింద శ్లోకాలు కానీ ఉచ్చరించినట్లు ఐతే మీ విద్య బుద్దిని పెంచుకోవడానికి దోహదపడుతాయి .

ఇట్లు – ANR జ్యోతిష్య పండితులు