సాహో మేకింగ్ వీడియో : బాహుబలిని మించే సినిమా
అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చిత్రం ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం “సాహో “. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా చిత్రం యూనిట్ ఈరోజు ఒక టీజర్ రిలీజ్ చేసింది .
ఈ టీజర్ జస్ట్ మేకింగ్ టీజర్ మాత్రమే , కానీ సినిమా లో పెట్టిన ఖర్చు ఫ్రేమ్ తో ఫ్రేమ్ కనబడుతూ ఉంది . యూవీ క్రియేషన్స్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తుంది , “రన్ రాజా రన్ ” ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో వస్తున్నా సాహో మాత్రం అభిమానుల ఆశలు అడియాసలు మాత్రం కావు ఇది పక్క .బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా హాలీవుడ్ ఛాయలు బాగా కనపడుతున్నాయి .
డార్లింగ్ ప్రభాస్ ఇందులో మరీ స్టైలిష్ గా కనపడుతున్నాడు , ఈ టీజర్ లో శ్రద్ధ కపూర్ కూడా ఫైట్స్ చేస్తున్నట్టు ఉంది . చూడాలి ఇంకా ఎన్ని ఎన్ని అద్భుతాలు చూడాలి సాహూ లో , మొత్తం మీద ఒక హాలీవుడ్ మేకింగ్ మన తెలుగు సినిమా స్థాయిని పెంచింది అని అభినందనీయం .