టీడీపీ లో అవమానాలు భరించా : రావేలా కిశోర్ బాబు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు టీడీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నాడు . ప్రెస్ మీట్ లో చంద్రబాబు ఎవరి మాట వినడు. విన్నట్టు నటించి తన నిర్ణయం తాను తీసుకుంటాఅని , ఇప్పటికి చాలామంది ఆయన మాజీ సహచరులు – మాజీ టీడీపీ నేతలు ఈ విషయం వెల్లడించారాని , ఓ ప్రాంతీయ పార్టీలో ఉంటూ ఆ పార్టీ గురించి ఆ పార్టీలో ఉండగా చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే ఆ పార్టీకి రాజీనామా ఇచ్చి జనసేనలో చేరానని రావెల కిషోర్బాబు చెప్పారు .

“నన్ను టీడీపీ అధినేత – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లో చేర్చుకున్నారు. చాలా గర్వంగా ఫీలయ్యాను. తర్వాత నాకు అర్థమైంది. అదంతా పైపైకే అని. నన్ను మంత్రిని చేసినా అధికారాలు మాత్రం ఆయన వద్దే పెట్టుకున్నారు” అని మాజీ మంత్రి రావెల్ కిశోర్ బాబు వెల్లడించారు. అన్ని విషయాల్లో అన్ని నిర్ణయాలు మా పేరుపై చంద్రబాబే తీసుకుంటారని రావెల చెప్పారు. పదవి ఉండీ ఏమీ చేయలేని పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆత్మాభిమానం చంపుకోలేక పోయాను. దీంతో అలాంటి పదవిలో – పార్టీలో ఉండటం కంటే రాజీనామా చేయడమే మేలనిపించి రాజీనామా చేశానన్నారు.విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో భార్యతోపాటు వెళ్లి జనసేన కండువా కప్పుకున్న సందర్భంగా కిశోర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అదే సమయంలో … పవన్ కళ్యాణ్ ఆయనకు మంత్రి పదవి ఖరారు చేశారు. వచ్చే ఏడాది రావెల కిశోర్ బాబు ఎమ్మెల్యే అవుతారు, మంత్రి కూడా అవుతారు అంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఐతే తమ పార్టీకి పట్టిన మైల పోయిందంటూ టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాడులోని నిమ్మగడ్డవారిపాలెం కూడలిలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని శనివారం పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేసి.. క్షీరాభిషేకం చేశారు.పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చామన్నారు.అలాంటి వ్యక్తి నేడు టీడీపీకి రాజీనామా చేయడం దారుణమన్నారు. రావెల రాజీనామాతో పార్టీకి పట్టిన మైల పోయిందంటూ మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందునే.. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశామని చెప్పారు. రావెల రాజీనామా వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ మండలాధ్యక్షుడు గింజుపల్లి శివరాంప్రసాద్, జెడ్పీటీసీ భాగ్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.విజయ్‌బాబు తెలిపారు.

కొసమెరుపు ఏమిటంటే రావేలా కొడుకు మీద ఉన్న కేసులు , రావేలా చేసిన అక్రమాలు చంద్రబాబు మల్ల ఆ ఫైల్స్ తిరగవేస్తారు అని టీడీపీ నాయకులూ చెప్పుకోనున్నారు .

cinemaroundup

Next Post

రావేలా మీద మహేష్ కత్తి అభిప్రాయం

Sun Dec 2 , 2018
mahesh kathi on ravela