Cinema news

ఈ ఎన్టీవోరు భలేగున్నాడే!

lakshmis ntr

“వెన్నుపోటు వల్ల చనిపోయిన ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి మనముందుకొచ్చారు” అంటూ ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశాడు వర్మ.వివాదాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ . వివాదం నుంచి డబ్బుని చేయగలిన మహామేధావి వర్మ . వర్మ వస్తున్నాడు అంటే చాలు టీవీ చానెల్స్ కి పండుగ . అలాంటి వర్మ ఇప్పుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం మీద ఒక పాట రిలీజ్ చేసాడు అంటే ఎంత దమ్ముండాలి .
ఎలాగూ బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది , బాలయ్య బాబు ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు అంటూ రెండు భాగాలూ తీసాడు , మొదటి భాగమే మిశ్రమ స్పందన వచ్చింది , పైగా బాలయ్య మీద జోక్స్ బాగా పేలాయి , బాలయ్య ఎన్టీఆర్ లాగా సూట్ అవ్వలేదు అని .
ఇప్పుడు ఎన్టీఆర్ , లక్ష్మి పార్వతి వైవాహిక జీవితం మీద ఫోకస్ చేస్తూ తీస్తున్నాడు . ఎలాగూ బాలయ్య సినిమా లో వెన్నుపోటు ఎపిసోడ్ ఉండదు .సో ఎవరైనా ఈ ఎపిసోడ్ చూడాలి అనుకున్న వాళ్ళకి వర్మ ఇచ్చే విందు పసందు . ఇందులో ఎన్టీఆర్ గా ముంబై కి చెందిన స్టేజి ఆర్టిస్ట్ చేసారు . లుక్ మాత్రం పర్ఫెక్ట్ , దీనికి తోడు ఎన్టీఆర్ వాయిస్ కానీ తోడు ఐతే సినిమా అదుర్స్ .