Cinema news

వెన్నుపోటు …. నెవెర్ బిఫోర్ , నెవెర్ ఆఫ్టర్

lakshmis ntr vennupotu

ఫీనిక్స్ పక్షి లాగా పడిపోగానే లేసేవాడే యోధుడు . దేనికి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ , తన పని ఐపోయింది అన్న ప్రతి సారి మరల లిమేలైట్లో కి వచ్చేస్తుంటాడు . ఆఫీసర్ తో వర్మ పని ఐపోయింది అని అన్న వారు ఇప్పుడు వర్మ చేస్తున్న మార్కెటింగ్ చూస్తుంటే ముక్కున వేలేసుకుంటున్నారు .

సీనియర్ ఎన్టీఆర్ మీద rgv దర్శకత్వం లో వస్తున్న చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” , ఎలాగూ బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన చిత్రం “ఎన్టీఆర్ కథానాయకుడు ” చాల నిరాశపరిచింది, అందులో నిజాలు లేవంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు . సో ప్రేక్షకుల ఆశలు మొత్తం ఈ చిత్రం పైన ఉన్నాయి . మహాతెలివైన రామ్ గోపాల్ వర్మ ఈ అవకాశాన్ని ని బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు . ఆల్రెడీ వదిలిన రెండు సాంగ్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ ఇయ్యరు . ఇప్పుడు సోషల్ మీడియా లో మొరొక పిక్ వదిలాడు .

తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ “ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. . వారెవరో గుర్తుచేసుకోవడంలో నాకు సహాయం చేయగలరా?” అంటూ ప్రశ్నించాడు.

వర్మే అనుకుంటే వర్మ ఫాలోయర్స్ కూడా ఆయనకంటే ఘనులు. ఒక ఫాలోయర్ ‘నాకంటే గొప్ప నటుడు నారా: ఎన్టీఆర్’ అనే పాత పేపర్ క్లిప్పింగ్ ను జత చేశాడు. మరొకరు ‘ఎన్టీఆర్ పై బాబు వర్గం చెప్పుల దాడి’ అని క్లిప్పింగ్ ను కూడా పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తూ ఉంటే రామ్ గోపాల్ వర్మ పోస్టులకు భారీగా నే రెస్పాన్స్ వస్తున్నట్టు ఉంది.