కోడి రామకృష్ణ ఇక లేరు

kodi ramakrishna is no more

” అమ్మోరు ” “దేవి ” ” అరుంధతి ” “దేవిపుత్రుడు ” ” అంజి ” ఇలాంటి చిత్రాల పేర్లు చెబితే టక్కున గుర్తుకు వచ్చేది కోడి రామకృష్ణ గారు , సోసియో ఫాంటసిస్ కి పెట్టింది పేరు , గ్రాఫిక్స్ లో కొత్త అధ్యాయానికి తెరలేపిన వ్యక్తి కోడి రామకృష్ణ గారు . శతాధిక చిత్రాల దర్శకులు ఇక లేరు అనే వార్త ఇంకా నమ్మశక్యంగా లేదు , గురువారం తుది శ్వాస విడిచారు.
ప్రయోగాలకు మారు పేరు ఆయన ఈ తరం దర్శకులకి ఆదర్శం అయన .

తన తొలి చిత్రం ” ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ” తోనే విభిన్న దర్శకుడి గా తానేంటో నిరూపించాడు .తెలుగు , తమిళ్ , హిందీ చిత్రాలతో దర్శకుడిగా తనకు తాను నిరూపించుకున్నాడు . కోడి రామకృష్ణ గారి చివరి చిత్రం ” నాగాభరణం ” , ఆయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేసారు , సోషల్ మీడియా లో ఐతే కోడి రామకృష్ణ గారి మరణ వార్తకి పెద్ద ఎత్తున సంతాపాలు వస్తున్నాయి .