కథానాయకుడి ఎఫెక్ట్ మహానాయకుడి మీద ఉంటుందా ?

మహానాయకుడు అన్నగారు ఎన్టీఆర్ మీద బయోపిక్ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు , సీనియర్ ఎన్టీఆర్ మీద సినిమా తీయడం అంటే కత్తిమీదసామే , కానీ ఈ మహాకార్యాన్ని అన్నగారి అబ్బాయి బాలయ్య బాబు బుజానవేసుకున్నాడు . అప్పుడు ఫాన్స్ కి ఇది ఒక విసువల్ ఫీస్ట్ గా ఉండిపోద్ది అని అందరు అనుకున్నారు , అచ్చం తండ్రి పోలికలు ఉన్న బాలయ్య బాబే ఈ సినిమాకి సరైన హీరో అని అందరు అనుకున్నారు .

మంచి కదా , సినిమా లో క్వాలిటీ మీద ఎక్కడ రాజి పడకుండా తీశారు , ఫస్ట్ లుక్ , టీజర్స్ , ట్రైలర్స్ అన్ని చక్కగా కుదిరాయి . టీడీపీ అభిమానాలు , నందమూరి అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచేశారు , సినిమా విడుదల అవ్వగానే చిత్రానికి వచ్చిన సమీక్షలు కూడా పాజిటివ్ గా ఉన్నాయి , ఇంకేముంది సినిమా సూపర్ డూపర్ హిట్ అని అనుకున్నారు , కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అంది , మేకర్స్ కి షాక్ , కారణాలు ఎన్నో , కర్ణుడి చావుకి వంద కారణాలు ఎలాగో , అన్ని కారణాలు కథానాయకుడి కి ఉన్నాయి .

సినిమా లో సృజనత్వం లేకపోవడం , ఎన్టీఆర్ నిజజీవితం లో అసలు కష్టపడకుండా హీరో ఐపోవడం , సినిమాలు గేటుప్ ఎక్కువ డ్రామా తక్కువ ,అంతా మహానటి ఛాయలో తీసినట్టు ఉంది అని నందమూరి అభిమానులే కాకా , మాములు ప్రేక్షకులు కూడా సినిమా చూసి పెదవి విరిచారు .ఎన్టీఆర్ ఒక సూపర్ స్టార్ ఇయ్యుండొచ్చు కానీ మరి మహానుభావుడి లాగా , ఒక దేవుడి లాగా చూపించకుండా మహానటి లాగా ఒడిదుడుకులు ఉంది ఉంటె బాగా ఉండేది అని విశ్లేషకుల అంచనా .

ఐతే ఇప్పుడు అందరి అంచనాలు రెండవ భాగం ” మహానాయకుడి ” మీద ఉన్నాయి ,ఈ చిత్రం ఫిబ్రవరి 14 న విడుదలకు సిద్ధం గా ఉంది . ఐతే సినీ ప్రేక్షకులు అంచనా ప్రకారం మొదటి పార్ట్ ఇలాగుంది అంటే రెండవ భాగం ఎలా ఉండబోతుందో ఒక అంచనాకి వచ్చేసారు . ఎలాగూ ఎన్టీఆర్ జీవితం లో అతి పెద్ద దెబ్బ నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ , వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్స్ టచ్ చెయ్యరు అని మేకర్స్ దగ్గర నుండి వినిపిస్తున్న మాట .
ఇంకా ఇలాంటివే లేకపోతే చుసిన ఏమి ప్రయోజనం , జస్ట్ ఎన్టీఆర్ ఒక హీరో నుండి ముఖ్యమంత్రి దాక ఎలా ఎదిగారు అని ఒక డాక్యూమెంటరీ తీస్తే సరిపోతుంది కదా అని పలువురు అంటున్నారు .
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో ఈ చిత్రం తయారవవుతుందని , అందుకే తనకు మచ్చ పడే విధం గా చెయ్యకుండా జస్ట్ ఆలా వచ్చి పోయే క్యారెక్టర్ ఉండేటట్లు చేసుకున్నారు అని అంటున్నారు .

తన బావ కళ్ళలో ఆనందం కోసం బాలయ్య బాబు తన తండ్రి జీవిత చరిత్రని అపహాస్యం చేయడం మంచిది కాదు అని , ఈ చిత్రాన్ని ఒక రాజకీయ అస్త్రం గా తయారు చేయకుండా , ఆ మహనీయుడు చేసిన త్యాగాలు , కుటుంబ అంతర్గత వ్యవహారాలు చూపిస్తే సూపర్ హిట్ పక్క అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .

ఐతే ఇప్పుడు వస్తున్నా కామెంట్స్ ఏమిటంటే ఎన్టీఆర్ జీవితం గురించి వచ్చిన బయోపిక్ కంటే , నాదెండ్ల భాస్కర్ రావు ఇస్తున్న ఇంటర్వూస్ కె ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనడం కొసమెరుపు .

-venkat pasunuti

cinemaroundup

Next Post

Puncch Beat : Six pack Abs , Streamy kisses and Sports

Fri Jan 18 , 2019
puncch beat