
దీపావళి కంటే ముందు దంతెర రోజు ఏదయినా వస్తువు కొంటె అన్ని శుభాలే జరుగుతాయని ప్రజలు నమ్ముతుంటారు , లక్ష్మి దేవి మరియు కుబేర స్వామి ని ఆ రోజు అంతా జనాలు పూజిస్తారు . ఆ రోజు ఏదయినా వస్తువు కొంటె అది వాళ్ళకి బాగా కలిసివస్తుంది అని నమ్మకం .
నవంబర్ 5 తేదీన ధన త్రయోదశి వచ్చింది అని జ్యోతిష్య పండితులు నిర్ధారించారు
ప్రముఖ జ్యోతిస్యులు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ వస్తువు కలిసివస్తుంది అని ఇక్కడ చెబుతున్నారు :
మేష రాశి :
కాపర్ లాంటి వస్తువైనా కొంటె మంచిది , స్థలం లేదా ఏదయినా బిల్డింగ్ కొంటె శుభం .
వృషభ రాశి :
వెండి కానీ లేదా బియ్యం కొంటె మంచిది.
మిథున రాశి :
బంగారం కొంటె మంచిది , కాంస్య తో తయారు చేసిన వినాయకుడి విగ్రహం కొంటె మరీ మంచిది .
కర్కాటక రాశి :
వెండికి సంబంధించిన వస్తువు ఏమైనా కొంటె చాల శుభం .
సింహ రాశి :
ఇత్తడితో తయారు చేసిన ఏ వస్తువైనా కొంటె మంచిది , బంగారం కూడా కొనవచ్చు .
కన్య రాశి :
ఈనుగు బొమ్మ లాంటిది ఏదయినా కొంటె మంచిది , కాంస్య తో తయారైన ఏదయినా వస్తువు కొంటె శుభం .
తులా రాశి :
వెండి సామాన్లు కొంటె మంచిది .
వృశ్చిక రాశి :
రాగితో తయారైన ఏదయినా వస్తువు కొంటె మంచిది , బెల్లం లేదా గోధుమ కొంటె మరీ మంచిది .
ధను రాశి :
పసుపు కొంటె మంచిది , బంగారం కొంటె ఇంకా మంచిది .
మకర రాశి :
ఇంటికి సంబంధించి ఏదయినా వస్తువు కొంటె చాలు మంచిది .
కుంభ రాశి :
వాహనము లేదా ఏదయినా ఎలక్ట్రానిక్ వస్తువుని కొంటె మంచిది.
మీనా రాశి:
ఇంటికి సంబంధించిన ఏదయినా వస్తువు కొంటె మంచిది .
-ANR jyothisyam