విలన్ గా మారనున్న హీరో

siddharth

హీరో గా ఒక వెలుగు వెలిగి , తిరిగి ఫామ్ కోల్పోవడంతో ఇప్పుడు ఆ హీరోలు విలన్ రొలెస్ బాట పట్టారు .
జగపతి బాబు ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎమ బిజీ గా ఉన్నారు , శ్రీ కాంత్ కూడా ” యుద్ధం శరణం ” తో విలన్ గా పరిచయం ఐయి చేతులు కాల్చుకున్నాడు . ఈ కొత్త పద్ధతి వల్ల చాల మంది ఓల్డ్ హీరోస్ ఇప్పుడు విలన్ అవతారం ఎత్తడానికి రెడీ ఇపోయారు . ఇప్పుడు ఇంకొక హీరో విలన్ అవతారం ఎత్తడానికి సిద్ధం అవుతున్నాడు, అతడే “బొమ్మరిల్లు సిద్ధార్థ్ ” వరుస విజయాలతో అమ్మాయిల గుండెల్లో నిద్రపోయిన సిద్ధార్త్ ఆ స్టార్ స్టేటస్ ని కాపాడుకోలేక పోయాడు .కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రొలెస్ చేసినప్పటికీ ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయాడు . నిర్మాతగా కూడా మరి కొన్ని చిత్రాలు నిర్మించి నప్పటికీ ఆర్ధికంగా ఎదగలేక పోయాడు . మైత్రి మూవీస్ బ్యానర్ మీద నాని హీరో గా , విక్రమ్ కుమార్ దర్శకత్వం లో వస్తున్నా చిత్రానికి సిద్దార్థ్ ని అప్రోచ్ అయ్యారు అంట మేకర్స్ , వెంటనే విలన్ వేషానికి ఒప్పుకున్నాడు అంట సిద్దార్థ్ . ఈ వార్త నిజమో కాదో తెలియడానికి కొంత సమయం వేచిచూడాలి . సిద్ధార్థ్ స్టైలిష్ విలన్ గా ఈ మేరకు మెప్పిస్తాడా చూడాలి .