National News

లగడపాటి సన్యాసం – కేటీఆర్

lagadapati rajagopal

తెలంగాణలో హోరాహోరిగా సాగిన ప్రచారం ముగిసిన అనంతరం నేతలంతా కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి రాజగోపాల్.. సర్వేల నుంచి కూడా సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తాజాగా మంత్రి కేటీఆర్తో పాటుగా ముగ్గురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. మంత్రులు మహేందర్ రెడ్డి – తలసాని శ్రీనివాస్ యాదవ్ – లక్ష్మారెడ్డి సహా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు టీఆర్ ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

“జిల్లాల నుంచి కార్యకర్తలు, నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌కు బాగా ఓట్లు పడ్డాయి. ఓటింగ్‌ జరిగిన సరళిని పరిశీలిస్తే ప్రజలు ప్రభుత్వానికే అండగా ఉన్నారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ 100కు పైగా స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుంది” అని కేటీఆర్ చెప్పారు.

మకు తాము సీఎంలుగా చెప్పుకున్న కొంత మంది కాంగ్రెస్‌ నేతలు కూడా గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందని.. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు తమకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

కౌంటింగ్ జరిగే సమయంలో కార్యకర్తలు జర హుషార్ ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. లగడపాటి ఏమన్నాడో ఆయనకే అర్థం కాలేదు. తెలంగాణ ఏర్పాటుతో లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత లగడపాటికి సర్వేల నుంచి కూడా సన్యాసమే. మరిన్ని విషయాలు 11వ తేదీన చెబుతాను అని కేటీఆర్ అన్నారు.