National News

రేపు ఎవరు గెలిచినా ఎంఐఎం దే పైచెయ్యి

MIM Plays Key role in Telangana Election Results 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యతు మంగళవారం తేలిపోనుంది. ఎవరెవరు అసెంబ్లీకి వెళ్తారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఎంత మంది ఇండిపెండెంట్స్ గెలుస్తారు , ఎవరు ప్రజాతీర్పుతో తమ వైఫల్యాన్ని అంగీకరిస్తారు ? అనే విషయాలపై దాదాపు మరో 24 గంటల్లో స్పష్టత రానుంది.ఈ లోపల,రాజకీయ పక్షాలు భేటీలతో ఏమ బిజీ అయిపోయాయి.

ఈరోజు మధ్యాహ్నం కెసిఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తో భేటీ కానున్నారు. ఫలితాల అనంతరం పరస్పరం సహకరించుకొనే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాసను మాత్రం ప్రభుత్వాన్ని రేపాటు చేయనివ్వకుండా , కెసిఆర్ ని ఫార్మ్ హౌస్ కి అంకితం చెయ్యాలన్నవ్యూహంతో ఉన్న కాంగ్రెస్ అవసరమైతే.. ఈ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎంను కూడా తమ జట్టులో కలుపుకోడానికి వెనుకాడట్లేదు .

మళ్లీ టీఆర్ ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని పలు జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చినప్పటికీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి మాత్రం లగడపాటి సర్వే మీదే తమ విజయావకాశాలపై ధీమాతోనే ఉంది.

ఎన్నికలకు ముందు కూడా ఎంఐఎం తాము పోటీ చేయని స్థానాల్లో టిఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందిగా ముస్లింలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎంఐఎం ఎప్పుడు తెరాసకి మిత్రపక్షం గానే వ్యవహరిస్తోంది . ఇప్పుడు కొత్తగా వస్తున్నా వార్తలు ఏమిటంటే బీజేపీ కూడా తెరాస తో చేతులు కలాపానికి సిద్ధం గ ఉంది అని పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన బజ్ ని తయారుచేసేసారు . దీనికి తెరాస ఎలా స్పందిస్తుందో చూడాలి .

ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సమీకరణాలపై కాంగ్రెస్ పెద్దలు దృష్టిసారించారు . మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటే సరేసరి. ఎంచక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. . ఒకవేళ కూటమి సీట్లు అన్నీ కలిపినా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోతే ఎలా? అనే దానిపై కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఇతరుల మద్దతు తీసుకొనైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

కానీ వర్తమానంలో పరిస్థితిని గమనిస్తే… తెరాస వెన్నంటి మాత్రమే ఉండాలని ఒవైసీ చాలా స్ట్రాంగు డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో సోమవారం మద్యాహ్నం భేటీ అయిన ఒవైసీ, భేటీకి వెళ్లడానికి ముందు ఓ ట్వీట్ పెట్టారు.

‘తెలంగాణ పెద్దదిక్కు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. దేవుడి దయవల్ల.. ఆయన తన సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, మజ్లిస్ ఆయన వెన్నంటి ఉంటుందని కూడా చెప్పారు. జాతి నిర్మాణం అనే విస్తృత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది తమ తొలిఅడుగు మాత్రమే అని కూడా పేర్కొన్నారు.

ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం ఆశలు వదులుకోవట్లేదు. ఎలాగోలా ఎంఐఎంను బుజ్జగించి తమతో కలిసి నడిచేలా ఒప్పించాలని చూస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్ద ఒకరు అసదుద్దీన్ తో మాట్లాడినట్లు తెలిసింది. మరి ఫలితాలు వచ్చాక మజ్లిస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

అయితే ఇదంతా చూస్తుంటే ఆ మధ్య అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. హంగ్ పరిస్థితులు ఏర్పడితే తమ పార్టీ నుంచి సీఎం కూడా అయ్యే అవకాశం ఉందని, కింగ్ మేకర్ లు గా కాదని సాక్షాత్తు కింగ్ గానే తాము అవతరించగలమని ఆమధ్య ఓవైసీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆయన మద్దతుపొంది అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ కల నెరవేరుతుందా ? లేదా ? అనేది సందేహంగానే ఉంది,కొంత మంది దగ్గర నుంచి వస్తున్నా వార్తలు ఏంటంటే , కాంగ్రెస్ ఒవైసి కి ముఖ్యమంత్రి పదవి కూడా కట్ట బెట్టడానికి కూడా వెనుకాడట్లేదు అని , ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాలి అంటే రేపటి దాక వెయిట్ చెయ్యాలి .