రానా ఆన్సర్ కి త్రిష కి షాక్

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఎప్పుడు గోస్సిప్స్ కి ప్లేస్ ఇస్తూనే ఉన్నాడు , కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు .
బిపాసా బసు నుంచి త్రిష దాక అతని మీద ఉన్న పుకార్లు అన్ని ఇన్ని కావు , ఐతే తాజాగా ఈ ప్రొగ్రమ్మె లో కొన్ని విషయాలు బయటకు చెప్పేసాడు .రానా – త్రిష ప్రేమాయణం గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో వేడెక్కించే చర్చ సాగిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదారేళ్ల క్రితం మాట అది. ఆ తర్వాత ఆ ఇద్దరిపైనా రకరకాల రూమర్లు షికారు చేశాయి. కొంత గ్యాప్ తర్వాత త్రిష బిజినెస్ మేన్ వరుణ్ మానియన్ తో పెళ్లాడేందుకు సిద్ధమైంది. నిశ్చితార్థం అయ్యి చివరికి పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.దానికి రానా కూడా పరోక్షంగా కారణం అని అప్పట్లో వెబ్సైట్ లో చాల చేర్చే జరిగింది .
కరణ్ జోహార్ త్రిష కి రానా కి ఉన్న సంబంధం గురించి అడిగాడు , అప్పుడు రానా ఇచ్చిన సమాధానం చాలా డిప్లమ్యాటిక్. చాలా కాలం పాటు స్నేహంగా ఉన్నాం. అందువల్ల అందరూ అలా అనుకుని ఉండొచ్చు! అంటూ నవ్వేశాడు.
ఐతే ఈ వార్త వచ్చిన తరువాత త్రిష కొంచం షాక్ లో ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి .రానా ఇలా వాళ్ళ రేలషన్ గురించి ఇలా బహిర్గితం చేయడం తో త్రిష కొంచం ఆశ్చర్యానికి లోనయ్యింది , కానీ త్రిష కొంచం బోల్డ్ , అందుకే ఎక్కువసేపు దాని గురించి ఆలోచించ కుండా తన పని చూసుకుందని వాళ్ళ సన్నిహితులు చెప్తున్నారు .
ప్రస్తుతం త్రిష 96 మూవీ కి వచ్చిన విశేష స్పందన ఎంజాయ్ చేస్తూ ఉంది , రానా కూడా ఎన్టీఆర్ బయోపిక్ , హిరణ్య కశిప , హాతి మేరె సాతి షూటింగ్స్ లో బిజీ గా ఉన్నారు .

cinemaroundup

Next Post

ఎన్టీఆర్ బయో పిక్ లో ఈమె పాత్రే కీలకం

Tue Dec 25 , 2018
ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ , ఎన్టీఆర్ టైటిల్ పాత్రని అతని కొడుకు నందమూరి బాలకృష్ణ పోషించడం తెలిసిందే . రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి గా , విద్య బాలన్ బసవతారకం గా , నిత్యామీనన్ సావిత్రి లాగా చేస్తున్నారు , ఐతే ఇందులో అందరు సినిమా వాళ్ళ పాత్రలో నటిస్తున్నారు , ఐతే అన్నగారు పార్టీ పెట్టడానికి కారణమైన కాంగ్రెస్ లో […]
supriya vinod as Indira gandi in Ntr Biopic coverpic