CinemaRoundup

Movies|Politics|Astrology

యమకింకర పాటల రికార్డింగ్ మొదలు !!

రాజేంద్ర ఫిలిమ్స్ ,తోట కృష్ణ గారి దర్శకత్వంలో నిర్మాతలు నీలకంఠేశ్వర రెడ్డి మరియు అకుతోట రాజేందర్ గారి ఆధ్వర్యంలో యమకింకర అనే నూతన చిత్రం పాటల రికార్డింగ్ ఎల్ ఎం రికార్డింగ్ స్టూడియోలో ఘనంగా జరిగింది.
ఈ చిత్రం గురించి నిర్మాతలు నీలకంఠేశ్వర రెడ్డి మరియు రాజేంద్ర గారు మాట్లాడుతూ ఈ చిత్రం ఒక భిన్నమైన కథతో రూపొందిస్తున్నాము. మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ స్టార్ ఎల్ ఎం ప్రేమ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు మరియు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ తోట కృష్ణ గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు అని నిర్మాతలు తెలియజేసారు. డైరెక్టర్ తోట కృష్ణ గారు మాట్లాడుతూ” ఈ చిత్రం ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నాము ఇందులో ఆర్టిస్టులు మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు పాత కొత్త కలయికతో రూపొందిస్తున్నాం. అంతేకాకుండా ఈ చిత్రంలో సంగీతానికి ముఖ్య పాత్ర ఉంటుంది. మ్యూజిక్ స్టార్ ఎల్ ఎం ప్రేమ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారని “తెలియజేశారు.
ఈ చిత్ర సంగీత దర్శకులు
ఎల్ ఎం ప్రేమ్ గారు మాట్లాడుతూ “ఈ చిత్రంలో మూడు పాటలు ఒక బిట్ సాంగ్ ఉంటుందని తెలియజేశారు. మూడు పాటలు కూడా మంచి మాస్ బీట్ తో ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టుగా అద్భుతంగా పాటలు ఉంటాయని బ్యాక్గ్రౌండ్స్ కొరకు ఎక్కువ అవకాశం ఉన్న ఇలాంటి చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు “సంగీత దర్శకులు ఎల్ ఎం ప్రేమ్ గారు.
ఈ చిత్రంలో మొదటి పాటగా “సూదిలో దార మెట్టు మామ” అనే మా సాంగ్ మొదటి పాటగా రికార్డ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా యూనిట్ అందరికీ మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎల్ ఎం ప్రేమ్ గారు తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలోని నటీనటులు కూడా ఈ రికార్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అని తెలియజేశారు.