ఫలక్నుమా దాస్ , దాస్ కా బాస్

“వెళ్ళిపోమాకే ” ఈ సినిమా ని దిల్ రాజు చాల ప్రేమతో విడుదల చేసారు , అది యూట్యూబ్ లో బాగా ఫేమస్ ఐయ్యింది. దాంట్లో హీరో గా నటించిన విశ్వక్ సేన్ పరిచయం అయ్యాడు , దాని తరువాత “ఈ నగరానికి ఏమైంది ” అనే చిత్రం లో లీడ్ రోల్ లో నటించి , అలరించాడు , ఇప్పుడు తానే డైరెక్టర్ అవతారం ఎత్తాడు “ఫలక్నుమా దాస్ ” పేరు తో ఈ చిత్రం వస్తుంది , నిన్న ఈ చిత్రం యొక్క టీజర్ రిలీజ్ ఐయ్యింది , టీజర్ అందరికి అంచనాలు మించి ఉంది , విశ్వక్ సేన్ డైరెక్టర్ స్టామినా ఏంటో ఈ టీజర్ చెప్పకనే చెప్తుంది .

మలయాళం ” అంగళ్యం డైరీస్ ” చిత్రాన్ని తెలుగు లో “ఫలక్నుమా దాస్ ” పేరు తో రీమేక్ చేసారు , ఇందులో “పెళ్లి చూపులు ” “ఈ నగరానికి ఏమైంది ” చిత్రాల డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ గా నటిస్తున్నాడు . చిత్రం మొత్తం హైదరాబాద్ యాసలో ఉంటుంది .
ఐతే మలయాళం మాతృక లో “పోర్క్ షాప్ “చుట్టూ ఈ కథ తిరుగుతుంది , ఇందులో మాత్రం”మటన్ షాప్” చుట్టూ తిరుగుతుంది .అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ” మీర్జాపూర్ ” లో నటించిన హర్షిత గౌర్ ఈ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమవుతుంది . సలోని మిశ్ర , ఉత్తేజ్ తదితరులు నటిస్తున్నారు .”పెళ్లి చూపులు “, “సమ్మోహనం ” ” ఈ నగరానికి ఏమైంది ” ” యుద్ధం శరణం ” చిత్రాలకు సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు .

cinemaroundup

Next Post

Lakshmi's NTR : Hard Hitting Tale

Thu Feb 14 , 2019
Lakshmi's NTR