National News

నన్ను ఉరితీయండి అని అంటున్న ఎంపీ

sakshi maharaj

సాక్షి మహారాజ్, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందిన ఈ బీజేపీ ఎంపీ , మల్లి వార్తలోకి ఎక్కారు , ఢిల్లీ లో ఉన్న జమ మస్జీద్ ని కూల్చండి అక్కడ హిందూ దేవుడి విగ్రహాలు లేకపోతే నను ఉరివేయ్యండి అని అన్నారు .

నేను రామ్ మందిర్ తీర్పుపై సుప్రీమ్ కోర్టు వైఖరిని ఖండిస్తున్నాను. సుప్రీమ్ కోర్ట్ అనవసరమైన విషయాలు మీద నిర్ణయాలు చాల త్వరగా తీసుకుంటుంది, కానీ అయోధ్య కి వచ్చే సరికి మాత్రం పట్టి పట్టన్నట్టు ఉంటుంది .నేను ప్రైమ్ మిస్టర్ నరేంద్ర మోడీ గారిని లోక్ సభ లో బిల్ పాస్ చేయమని చెప్తున్నాను , 2019 ఎలక్షన్స్ లోపల రామ మందిరం నిర్మాణం మొదలుపెడితే మంచిది ” అని అన్నారు .

రాజకీయ పార్టీలు ముందస్తు రామ మందిరం నిర్మాణం కోసం గవర్మెంట్ ఆర్డినెన్సు కోసం ఎదురుచేసుతూన్న సమయం లో సాక్షి మహారాజ్ ఇలా చెప్పడం తో అది ఇంకా ఊపందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .