రాజన్న “యాత్ర “

న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, సుహాసిని మ‌ణిర‌త్నం, జ‌గ‌ప‌తిబాబు అన‌సూయ‌ , ఆశ్రీత వేముగంటి త‌దిత‌రులు

బ్యాన‌ర్‌:70 యంయం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌: విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి
సంగీతం: కె.కృష్ణ‌మూర్తి
కెమెరా: స‌త్య‌న్ సూర్య‌న్
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్
ద‌ర్శ‌క‌త్వం: మ‌హి.వి.రాఘ‌వ్
రిలీజ్ తేదీ: 08-02-౨౦౧౯

దేశవ్యాప్తంగా బయోపిక్స్ హవా నడుస్తోందిప్పుడు. మొన్ననే ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు రిలీజైంది. ఆ సిరీస్ లో పార్ట్ 2 మ‌హానాయ‌కుడు జ‌నం ముందుకు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ త‌ర్వాత ఒక నాయ‌కుడిగా అంత‌టి ఇమేజ్ సంపాదించుకున్న దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ నేడు ప్ర‌పంచవ్యాప్తంగా దాదాపు 970 స్క్రీన్ల‌లో రిలీజ్ ఇయ్యింది .

కథ :
అప్పటి చంద్రబాబు సర్కారు ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందస్తుకు సిద్ధం కాగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదన్న భావనతో ఉంటారు. అలాంటి సమయంలో అసలు జనం సమస్యలేంటో.. వాళ్లు ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి వైఎస్ పాదయాత్ర మొదలుపెడతాడు. ఈ యాత్రలో జనం నాడిని వైఎస్ ఎలా పట్టుకున్నాడు.. వాళ్ల అభిమానాన్ని ఎలా చూరగొన్నాడు.. ఈ యాత్ర 2004 ఎన్నికల్లో గెలిచి వైఎస్ ముఖ్యమంత్రి కావడానికి ఎలా దోహదపడింది అన్నది మిగతా కథ.


కధనం :
ఎమోషన్స్‌ ఎంత పండితే, వాటితో ప్రేక్షకులు ఎంత కనక్ట్‌ కాగలిగితే సదరు దృశ్యాలు అంత పండుతాయి అనిపించే సన్నివేశాలు ఈ చిత్రం లో సుదీర్ఘంగా వున్నాయి.
యాత్ర’ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కాదు. ఆయన రాజకీయ జీవితంలో అత్యoత కీలకంగా నిలిచిన పాదయాత్ర చుట్టూ నడిచే ఒక ఎమోషనల్ జర్నీ మాత్రమే.
‘యాత్ర’ను ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మహి.వి.రాఘవ్ విజయవంతం అయ్యాడు.ఆనందో బ్రహ్మ లాంటి హారర్ కామెడీ తీసిన తరువాత ఈ చిత్రం ఎలా డీల్ చేసాడో అనుకున్న వాళ్ళకి ఈ సినిమా చాలు మహి వ్ రాఘవ్ రేంజ్ ఏంటో చెప్పడానికి .వైఎస్ సతీమణి విజయమ్మగా సుశ్రిత.. సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని తదితరులు ఆయా పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు

ప్లస్ పాయింట్స్ :
*మ‌మ్ముట్టి న‌ట‌న‌. ఆయ‌న‌ ఈ చిత్రానికి 100 శాతం ప్ల‌స్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌కు యాప్ట్.
*వైయ‌స్సార్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే సీన్స్ హైలైట్స్

నెగటివ్ పాయింట్స్ :
*డాక్యుమెంట‌రీని త‌ల‌పించ‌డం.

కొస మెరుపు :
రాజన్న “యాత్ర “

Rating : 3/5