ట్రోల్ల్స్ కి అవకాశం ఇస్తున్న ” మహానాయకుడు “

” మహానాయకుడు ” సినిమా మేకర్స్ ట్రోల్ర్స్ కి మంచి అవకాశం ఇస్తున్నారు, ఇప్పటికే ఈ సినిమా ఎలా హైప్ తీస్కొని రావాలా అని సినిమా యూనిట్ తర్జన భర్జన పడుతుంటే , ఇలాంటివి కనపడితేనే సినిమా నెగటివిటీ కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది .


క్రిష్ దర్శకత్వప్రతిభ సినిమా సినిమాకి పెంచుకుంటూ పోతుంటే కధానాయకుడు , మణికర్ణికా దెబ్బకు కొంచం వెనుక పడ్డాడు . ఐతే ఈ మహానాయకుడి టీజర్ లో మాత్రం క్రిష్ మీద అనుమానాలు మల్లి మొదలయ్యాయి . ఎన్టీఆర్ పాత్రలో తన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండడం , అంటే ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ ఈ సినిమాలో కానీ స్వర్గేయా ఎన్టీఆర్ ఫోటో ఒకటి చంద్రబాబు గా నటిస్తున్న రానా వెనుక ఫోటో లో ఉండడం త్రోల్లెర్స్ కి మంచి అవకాశం ఇవ్వడం నిజంగా ఆలోచించాల్సిన విషయం .

మహా నాయకుడి ట్రైలర్ లో భజన ఎక్కువయిందన్న మాట వాస్తవం , ట్రైలర్ లో ” ఇందిరా గాంధీ పాత్ర ఎన్టీఆర్ కృష్ణుడి కటౌట్ చూసి హే కృష్ణ అని పిలుస్తుంది , దానికి పక్క ఉన్న అయన అమ్మ అది ఎన్టీఆర్ కటౌట్ అని అంటదు ” ఇలాంటివి ఫాన్స్ కి నచ్చోచ్చు కానీ కామన్ ఆడియన్స్ కి ఎబ్బెట్టు గా ఉంటాయి , ఇలాంటివి ఫస్ట్ పార్ట్ లో ఉన్నవి కాబట్టే సినిమా డిసాస్టర్ గా నిలిచింది అని ట్రేడ్ పండితులు అంటున్నారు .
ఈ సీన్ మీద పెద్ద ఎత్తున్న సోషల్ మీడియా లో సినిమా మీద బాగా నెగటివ్ ప్రచారం జరుగుతుంది .చూడాలి ఇన్ని నెగటివిటీస్ తట్టుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెట్టుకొస్తుందో లేదో .