ghani joined ysrcp
- National News

బాలయ్యకు షాక్


ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మరో పార్టీ విజయం సాధించలేదు. వేరే నాయకుడు లేకనో లేక ఎందుకో ఆ నియోజకవర్గంలో టీడీపీ ఏ గెలుస్తూ వస్తుంది .శ్రీకాకుళం లో పాదయాత్రను సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరాడు ఘనీ. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలా ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి చేరడం విశేషం.

హిందూపురం నియోజకవర్గంలో ముస్లింల జనాభా గణనీయంగా ఉంది. ఇలాంటి చోట ఘనీకి గతంలో టీడీపీ టికెట్ ఇచ్చింది. పెద్దఎత్తునే ఉన్న బీసీ ఓటు బ్యాంకు కూడా టీడీపీ వైపే నిలుస్తూ ఉండటంతో హిందూపురంలో టీడీపీ తరఫున ఎవరు పోటీచేసినా గెలిచే పరిస్థితి. గత కొన్నాళ్లుగా ఘనీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అయితే – చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన వెంటనే ఘనీ వైసీపీలో చేరడం గమనార్హం. శ్రీకాకుళంలో జగన్ ను కలిసిన ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

cinemaroundup

cinemaroundup