నాగబాబు ఈ సారి టార్గెట్ , లోకేష్ బాబు

ఈ మధ్య నాగబాబు బాలయ్య బాబు మధ్య యూట్యూబ్ వార్ ఎంత దూరం వెళ్లిందో అందరికి తెలిసిందే . 6 కామెంట్స్ అని నాగ బాబు బాలయ్య మీద వేసిన అస్త్రాలు ఎంత వరకు ఫలించాయో తెలియదు కానీ , సర్రిగ్గా అదే సమయానికి బాలయ్య బాబు తన తండ్రి మీద తీసిన చిత్రానికి బాగా డెంట్ ఐతే పడింది , దీనికి పరోక్షంగా , ప్రత్యక్షం గా నాగబాబు ఉన్నదో లేదో తెలియదు , కానీ అతని కామెంట్స్ ఈ సినిమా మీద కొంత ప్రభావం చూపించింది అన్నది వాస్తవం.

ఐతే తాజాగా ఇప్పుడు నాగబాబు కన్ను మన ప్రియతమా ముఖ్యమంత్రి నారా చంద్రబబు తనయుడు , ఐటీ అండ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ లోకేష్ బాబు మీద పడింది .” బాల వాక్కు , బ్రహ్మ వాక్కు ” .అని స్టార్ట్ చేసి ,తాను చిన్నప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే అంటూ పాట వినేవాడిని ఎందుకంటే పిల్లలు అస్సలు అబద్దాలు ఆడరు. పిల్లలకు అబద్దాలు అనేవి తెలియదు. ఈ పిల్లాడు ఏం మాట్లాడాడో ఒక సారి చూడండి అంటూ.. ‘మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎలాంటి అవినీతి బంధుప్రీతి మత పిచ్చి కుల పిచ్చి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగు దేశం పార్టీయే’ అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను చూపించాడు.

చూశారు కదా – ఆ పిల్లాడు ఎంత బాగా మాట్లాడాడో – నిజాన్ని నిర్బయంగా ఒప్పుకునే దమ్ము తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎవ్వరు లేరు లోకేష్ బాబు గారు – మీరు గ్రేట్ అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్స్ చేశాడు.

చూడాలి ముందు ముందు నాగబాబు గారు ఎక్కడి దాక పోతారో .