ఆ బాబు ని ఈ బాబు బాగా ఆదుకున్నాడు

శ్రీమంతు సినిమా లో మహేష్ బాబు విల్లన్స్ కి చెప్తాడు ” వాడిని వీడిని మీ అందిరిని ” అని అంటాడు .ఇప్పుడు మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఒక ఆటాడేసుకుతున్నాడు .
మొన్న బాలయ్య బాబు ని , ఇప్పుడు బాలయ్య అల్లుడు నారా లోకేష్ బాబు ని పోయిన వీడియో లో బాగా క్రిటిసైజ్ చేసి అందరికి నవ్వులు పూయించారు , ఈ సరి బాబు గారి టార్గెట్ టీడీపీ అను “కుల ” మీడియా మీద పడింది .
మాములుగా టీడీపీ మీడియా చంద్ర బాబు నంది అంటే నంది అని , పంది అంటే పంది అని రాస్తుంటారు , అందుకే కాబోలు ఇప్పుడు నాగబాబు డైరెక్ట్ గా టీడీపీ మీడియా మీద పడ్డారు .పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి వివాదం లో కూడా టీడీపీ మీడియా చేసిన హడావిడి ఇంత అంత కాదు .
దావోస్ సదస్సుకు వెళ్లిన లోకేష్ అనుభవంపై ABN ప్రసారం చేసిన ఓ కథనాన్ని ప్రదర్శిస్తూ, దాన్ని చూస్తూ నాగబాబు కూడా భజన చేస్తూ, కామెంట్ లు చేస్తూ, సెటైర్ లు వేస్తూ, ఓ వీడియో తయారుచేసారు. టోటల్ గా ఈ వీడియో ద్వారా ABN ఛానెల్ బాబుకు, లోకేష్ కు భజన చేస్తోందని డైరెక్ట్ గా చెప్పేసారు.

మొత్తానికి ఈ బాబు ఆ బాబు ని మాత్రం వదలట్లేదు గా ?? ఈ ఎలక్షన్ టైం లో ఇలా చేసి మనకు మంచి హాస్యాన్ని ఇస్తున్నారు అంతే గా …అంతే గా…

https://www.youtube.com/watch?v=GtVBN1vefPk