వివాహ పొంతనకు ఏ నక్షత్రాలు అనుకూలం

వధూవరుల మానసిక , ధార్మిక , శారీరక అన్యోనతను పరిశీలించడానికి నక్షత్రం మరియు రాశి పొంతనాలు అవసరం .ఈ పొంతలను అష్టకూటమి ద్వారా పరిగణిస్తారు .

వధువు నక్షత్రం నుండి వరుడు నక్షత్రం వరకు 18 గుణములు కన్నా తక్కువ రాకూడదు .
గుణములను గణించునప్పుడు శాస్త్ర రీత్యా దోష పరిహారాన్ని పరిగణలోకి తీసుకోవలెను .

గణదోష పరిహారం -వధువు రాక్షశ గణమై, వరుడు మానవ గణమైన , రాక్షస గణ దోషం లేని స్త్రీ నక్షత్ర మైనప్పుడు , గుణం ప్రాప్టించును .

రాక్షశ గణ దోషం లేని స్త్రీ నక్షత్రములు ఆశ్లేష , చిట్టా , విశాఖ , జ్యేష్ఠా , మూల , శతభిషం నక్షత్రములు .

రాశి కూట పరిహారం – వధువు రాశి ,వరుడు రాశి మిత్ర రాసులైనప్పుడు షష్ఠ – అష్టమదోషం ,ద్వి -ద్వాదశ మరియు నవ – పంచమ దోషములు పరిహామవుతాయి .

దోష పరిహారం గల రాశి కూటములు మేష వృశ్చికములు , మిధున – మకరములు , సింహ – మీనములు, తులా – వృషభములు , ధనుర్ – కర్కాటములు, మీనా – మేషాలు , సింహ – కర్కాటకములు , మకర – కుంభాలు , కన్య – తుల, వృశ్చిక – ధనుసులు , మేష -సింహాలు , వృషభ – కన్యలు , మిధున – తుల, సింహ – ధనుస్సు , తుల – కుంభ , వృశ్చిక – మీనములు , ధనుర్ – మేషాలు , మకర – వృషభాలు , కర్కాటక – వృశ్చికలు, కుంభ – మిధున , మీనా – కర్కాటక , కన్య – మకర , రాశులు వధూ వరులైనప్పుడు .

నాడీ దోషపరిహారముకొన్ని నక్షత్రములులలో – నాడి దోష పరిహారమవుతుంది .

నాడి దోషం లేని నక్షత్రాలుఉత్తర , శతభిషా , పూర్వాభాద్ర , పునర్వసు , ఆరుద్ర , మూల , అశ్విని , పూర్వాషాఢ , అనురాధ , ధనిష్ఠా , పుష్యమి , చిత్త, పూబ్భా, మృగశిర , కృత్తికా, విశాఖ , ఆశ్లేష , శ్రవణ, మఖ , ఉ.షాడ, రోహిణి .

ఏక నక్షత్రాలురోహిణి , అర్థ , హస్త , విశాఖ , శ్రవణం , ఉ . భాద్ర, రేవతి , నక్షత్రాలు , పాద బేధం ఉన్నపుడు దోషం లేదు. .