వ్యక్తిగత కారణాల వల్ల అర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ ఈ రోజు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా వెనుక ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్న ఉర్జిత్.. తక్షణమే ఆర్బీఐ గవర్నర్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్‌.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉర్జిత్‌ హయాంలోనే 2016 నవంబర్‌ 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఉర్జిత్ రాజీనామా వెనుక కేంద్రం తెస్తున్న వత్తిడిలే కారణం అని విశ్లేషకులు అంచనావేస్తున్నారు . గత కొంత కాలం గా కేంద్రం తో డీ కొంటున్న ఉర్జిత్ ఇలా చివరి క్షణం లో రాజీనామా చేసి కేంద్రానికి షాక్ ఇచ్చారు అని విశ్లేషకులు వాపోయారు .