ఫలానుమా దాస్ సెన్సేషన్

falaknuma das crosses 1 million

ఈ నగరానికి ఏమైంది లో వివేక్ గా నటించిన విశ్వక్సేన్ నటిస్తూ , నిర్మిస్తూ , దర్శకత్వం చేసిన చిత్రం ” ఫలక్నుమా దాస్ “, ఈ చిత్రం యొక్క టీజర్ నిన్న విడుదల చేసారు . విడుదల చేసిన 24 గంటలలోపు ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది .
పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. తరుణ్ భాస్కర్ పోలీస్ అధికారికగా కనిపిస్తున్నాడు. కుర్రాళ్ల మధ్య జరిగే గ్యాంగ్ వార్ లని డీల్ చేసే పోలీస్ గా తరుణ్ నటిస్తున్నాడు. వ్యసనాలకు అలవాటు పడి యువత ఎలాంటి క్రైం లకు పాల్పడతారో ఈ ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు చూపించారు.

విశ్వక్సేన్ నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కరాటే రాజు నిర్మాత. విద్యాసాగర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Author: