గల్లంతు ఐపోతాయ్ జాగ్రత్త :మహేష్ కత్తి

జనసేన అధ్యక్షుడు ఎప్పుడు వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారు , ప్రజతో మమేకమైపోవాలని ,వాళ్ళతో తన జనసేనాని జనాల్లోకి తీసుకుపోవాలని చాల కష్టపడుతున్నాడు . ఇంత కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ మీద ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి మాత్రం ఎదో ఒక ట్వీట్ పెడుతూనే ఉంటున్నాడు . పవన్ కళ్యాణ్ అమలాపురం లో జరిగిన రైతుల ముఖాముఖీ సమావేశం లో పవన్ కళ్యాణ్ “దేశాన్ని శాసించే ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలైన సరే కోనసీమ లో చమురు దోచుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు” అని అన్నాడు . కావాలంటే ఈ విషయం మీద అంబనిన ఎదురిస్తా అన్నాడు . దీనికి వెంటనే మహేష్ కత్తి వెంటనే తన ఫేస్బుక్ ఖాతాలో ఇలా అన్నాడు “ముందు నీకు ఆపాయింట్మెంట్ ఇస్తాడో లేదో కనుక్కో. ఎగేసుకుని లక్నోకి వెళ్లి మాయావతి కోసం పడిగాపులు పడటం. ఎందుకు వెళ్తున్నావో తెలీకుండా చెన్నై కి వెళ్లిపోవడం వరకూ ఒకే. అసలే ఇది పవర్ఫుల్ కార్పొరేట్ లాబీ. అడ్రస్సులు గల్లంతు అయిపోతాయ్. జాగ్రత్త!”

కత్తి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ ఐయ్యాయి.

mahesh kathi counter pawan kalyan