ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ సాంగ్ : అభిమానులకి పండుగే

Kathanayakudu

నట సింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తూ క్రిష్ జాగర్ణమూడి దర్శకత్వంలో మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ విడుదలైంది. ఈ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా… ఎన్టీఆర్ సీనీ జీవితాన్ని ‘కథానాయకుడు ‘ పేరుతో, రాజకీయ జీవితాన్ని ‘మహానాయకుడు’ పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మొదటి భాగం ‘కథానాయకుడు’లోని తొలి పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ తన సీనీ జీవితంలో పోషించిన పాత్రలను అద్భుతంగా వర్ణిస్తూ రచయితలు కె. శివదత్తా, కె రామకృష్ణ ఈ పాట రాశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖెర్ వాయిస్ దీనికి అందించారు .
జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 24 నమహానాయకుడు విడుదలకు సిద్ధమైంది.

Author: